News February 6, 2025
షిప్పింగ్ హార్బర్ నిర్మాణం సకాలంలో పూర్తి: అనకాపల్లి ఎంపీ

పూడిమడక వద్ద చేపట్టిన షిప్పింగ్ హార్బర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేస్తామని కేంద్ర పోర్టులు షిప్పింగ్ శాఖామంత్రి సర్బానంద్ సోనోవాల్ హామీ ఇచ్చినట్లు అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ బుధవారం తెలిపారు. శీతాకాల సమావేశంలో ఈ అంశాన్ని తను పార్లమెంట్లో ప్రస్తావించడం జరిగిందన్నారు. దీనిపై కేంద్రమంత్రి స్పందించి లేఖ రాసినట్లు ఎంపీ పేర్కొన్నారు.
Similar News
News March 26, 2025
సికింద్రాబాద్‌లో యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

సికింద్రాబాద్ మహంకాళి PS పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం.. వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో స్పాట్‌లోనే ఒకరు మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. స్పాట్ వద్ద సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.
News March 26, 2025
భారతీయులకు బంపరాఫర్.. విమాన టికెట్లపై 30 శాతం డిస్కౌంట్

యూఏఈకి చెందిన ఎతిహాద్ ఎయిర్‌వేస్ భారతీయుల కోసం బంపరాఫర్ ప్రకటించింది. సమ్మర్‌లో తమ సంస్థ విమానాల్లో ప్రయాణించే ఇండియన్స్‌కు 30 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఫ్రాన్స్, టర్కీ, స్పెయిన్, ప్రాగ్, గ్రీస్, వార్సా రూట్లలో ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. ఈ నెల 28లోగా బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది మే 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించవచ్చని వెల్లడించింది.
News March 26, 2025
ప్రకాశం: వైసీపీకి మరో షాక్ తప్పదా..?

ప్రకాశం జిల్లాలో YCPకి షాక్ ఇచ్చేందుకు TDP పావులు కదుపుతోంది. మార్కాపురం, త్రిపురాంతకం MPP ఎన్నిక గురువారం జరగనుంది. పుల్లలచెరువులో వైస్ MPP, ఎర్రగొండపాలెంలో కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక సైతం నిర్వహిస్తారు. అన్ని చోట్లా YCPకి పూర్తి మెజార్టీ ఉన్నా ఆయా స్థానాలను దక్కించుకోవడానికి TDP గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొందరు స్వచ్ఛందంగా టీడీపీ గూటికి చేరగా.. మరికొందరిని కొన్ని హామీలతో తమవైపు తిప్పుకుంటోంది.