News September 10, 2024
షిర్డీ సాయినాథుడి సేవలో స్పీకర్

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ షిర్డీ సాయినాథుడిని ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు స్పీకర్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం హారతి సమయంలో మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రాధాకృష్ణ వికే పాటిల్‌తో కలిసి సాయినాథుడిని మహా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Similar News
News November 26, 2025
గాంధీ ఆస్పత్రిలో యువకుడికి అరుదైన శస్త్ర చికిత్స

భూపాలపల్లి జిల్లా యువకుడు విజయ్‌కుమార్‌కు గాంధీ ఆసుపత్రి వైద్యులు అరుదైన ట్రాకియల్ రీసెక్షన్ & అనస్టమోసిస్ శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. విషం తాగిన తర్వాత ఏర్పడిన సబ్గ్లోట్టిక్ ట్రాకియల్ స్టెనోసిస్ సమస్య తీవ్రం కావడంతో ఈ నెల 12న సీటీవీఎస్, ENT విభాగాల వైద్యులు కలిసి క్లిష్టమైన ఆపరేషన్ చేశారు. సీటీవీఎస్ డా.జి. రవీంద్ర, ENT డా. భూపేందర్ రాథోడ్లను సూపరింటెండెంట్ డా.వాణి అభినందించారు.
News November 26, 2025
GHMCలో విలీనం.. తర్వాత బాదుడే.. బాదుడు

GHMCలో 27 మున్సిపాలిటీల విలీన ప్రక్రియ అధికారికంగా ముగిసిన అనంతరం ఆయా ప్రాంతాలకు గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పన్నులు పడే అవకాశముంది. ఆస్తి పన్ను, భవన నిర్మాణ అనుమతుల ఫీజులు, ట్రేడ్ లైసెన్సులు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. విధి, విధానాలు ప్రభుత్వం ఇంకా పూర్తిగా రూపొందించలేదు. విలీన ప్రక్రియ సమగ్రంగా ముగిసిన తర్వాత పన్నుల లెక్క తేలుతుంది. దీనిపై మీ కామెంట్
News November 26, 2025
HYD: బీసీ రిజర్వేషన్లపై రాహుల్ గాంధీని ప్రశ్నించిన KTR

తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ లో ఘాటుగా స్పందించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పిన రాహుల్ గాంధీ, పంచాయతీ ఎన్నికల్లో కేవలం 17% రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని KTR ప్రశ్నించారు.


