News April 15, 2025
షేక్‌కి సోమవారం!

గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేశారు. తనదైన షాట్లతో దూకుడుగా ఆడారు. రచిన్ రవీంద్రతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రషీద్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. వరుస ఓటముల తర్వాత విజయాన్ని అందుకున్న CSK ‘షేక్‌కి సోమవారం’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News October 26, 2025
NPA, స్త్రీ నిధిపై ADB కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్లో APM, DPMలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజి, NPAల తగ్గింపు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, స్త్రీ నిధి పురోగతిపై ప్రధానంగా చర్చించారు. కౌమార సభ్యుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్ పాల్గొన్నారు.
News October 26, 2025
కామారెడ్డిలో మటన్, చికెన్ ధరలు

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం మటన్, చికెన్ ధరలు గత వారం మాదిరిగానే స్థిరంగా ఉన్నాయి. కిలో మటన్ రూ.800 కాగా, కిలో చికెన్ రూ.250గా ఉంది. లైవ్ కోడి కిలో రూ.160 చొప్పున విక్రయిస్తున్నారు.
News October 26, 2025
చిత్తూరు: నేడు సర్టిఫికెట్ల పరిశీలన

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని భవితా కేంద్రాలలో పనిచేస్తున్న సహిత విద్య రిసోర్స్ పర్సన్ల సర్టిఫికెట్లు పరిశీలించనున్నట్లు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. వారికి రెగ్యులర్ పే స్కేల్ అందజేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం డీఈవో కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సర్టిఫికెట్లను ఆదివారం పరిశీలించనున్నట్లు తెలిపారు. పరిశీలనకు తప్పక హాజరు కావాలన్నారు.


