News April 15, 2025
షేక్‌కి సోమవారం!

గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లోనే 19 బంతుల్లో 6 ఫోర్లతో 27 పరుగులు చేశారు. తనదైన షాట్లతో దూకుడుగా ఆడారు. రచిన్ రవీంద్రతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగిన రషీద్ చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. వరుస ఓటముల తర్వాత విజయాన్ని అందుకున్న CSK ‘షేక్‌కి సోమవారం’ అంటూ ట్వీట్ చేసింది.
Similar News
News April 18, 2025
గుడ్‌ప్రైడే ఎందుకు జరుపుకుంటారో తెలుసా!

గుడ్ ఫ్రైడే రోజున ఏసుక్రీస్తు శిలువపై మరణించారని క్రైస్తవులు విశ్వసిస్తారు. మానవాళి సంక్షేమం కోసం ప్రేమ, కరుణ, క్షమాపణ లాంటి గొప్ప సద్గుణాల్ని ఏసు బోధిస్తుంటారు. అది నచ్చని అప్పటి రాజులు క్రీస్తును శిలువ వేస్తారు. ఆ రోజునే క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు. నల్లని వస్త్రాలు ధరించి తమ పాపాలకు ఏసును క్షమాపణ అడుగుతారు. ఇది జరిగిన 3వ రోజు ఆయన మళ్లీ జన్మించారనే నమ్మకంతో ఈస్టర్ డే జరుపుకుంటారు.
News April 18, 2025
భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ గోశాలపై ఆయన అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
News April 18, 2025
అన్నమయ్య : ఏకకాలంలో తనిఖీలు

సంఘ విద్రోహక చర్యలను అరికట్టేందుకు అన్నమయ్య జిల్లా పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఏక కాలంలో వాహనాలను తనిఖీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో గురువారం రాత్రి జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది సోదాలు చేశారు. రాత్రి 9 నుంచి ఆటో, బైక్ కార్, లారీ, బస్సుల పరిశీలుంచారు. ముఖ్యమైన ప్రదేశాలు, రహదారుల్లో పికెట్ ఏర్పాటు చేశారు.