News August 7, 2024
‘షోకాజ్ నోటీసులు ఉపసంహరించుకోవాలి’

పెన్షన్ పంపిణీలో ఆలస్యం చేశారనే కారణంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,000 మందికి పైగా గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వీటిని ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ కోరారు. ఈ మేరకు వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామికి వినతిపత్రం అందజేశారు. షణ్ముఖ్, పార్ష మధు, మణికంఠ పాల్గొన్నారు.
Similar News
News October 18, 2025
23 నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు: కలెక్టర్

పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులకు ఆధార్ నమోదు ప్రక్రియను నెల రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. విద్య, మహిళ శిశు సంక్షేమ శాఖ, నైపుణ్య అభివృద్ధి సంస్థ, డీఆర్డీఏ అధికారులతో శుక్రవారం కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. జనన ధృవీకరణ పత్రాలు లేనివారు దరఖాస్తులు చేసుకొని ధృవీకరణ పత్రాలు పొందాలన్నారు. ఈ నెల 23 నుండి 30వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంప్ లుజరుగుతాయన్నారు
News October 17, 2025
పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 21వ తేదీన మంగళగిరిలోని జరగనున్న ఏపీఎస్పీ 6వ బెటాలియన్ ఆక్టోపస్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను ఎస్పీ వకుల్ జిందాల్ శుక్రవారం పరిశీలించారు. ఆయన అమరవీరుల స్తూపం, వీవీఐపీ వేదికలు, గార్డ్ ఆఫ్ హానర్ ప్రాంతం, స్టేజి నిర్మాణం సహా ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లను సమీక్షించారు. పనులను నిర్దేశిత సమయానికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 17, 2025
తెనాలి: హత్య కేసులో నిందితుడి అరెస్ట్

తెనాలి చెంచుపేటలో మంగళవారం జరిగిన జుటూరి తిరుపతిరావు హత్య కేసు నిందితుడు గండికోట వెంకట సుబ్బారావును త్రీ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. మృతుడు, నిందితుడి స్వగ్రామమైన కోడితాడిపర్రులో నెలకొన్న చిన్న వివాదాలే హత్యకు దారితీశాయని డీఎస్పీ జనార్ధనరావు, సీఐ సాంబశివరావు తెలిపారు. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.