News January 6, 2025

సంక్రాంతికి ఊరెళుతున్నారా.. ఇది మీకోసమే.!

image

కైకలూరు, గుడివాడ, విజయవాడ మీదుగా సంక్రాంతి సందర్భంగా చర్లపల్లి(CHZ)- కాకినాడ టౌన్(CCT) మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07031 CHZ-CCT రైలు ఈనెల 8,10,12,14న, నం.07032 CCT-CHZ రైలు ఈనెల 9,11,13,15న నడుపుతామన్నారు. ఈ రైళ్లు చర్లపల్లిలో పై తేదీలలో రాత్రి 9.45కి బయలుదేరి తరవాతి రోజు ఉదయం 8.30కి కాకినాడ టౌన్ చేరుకుంటాయన్నారు. 

Similar News

News January 9, 2026

కృష్ణా: Way2Newsలో రిపోర్టర్‌గా చేరాలనుకుంటున్నారా.!

image

కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో Way2Newsలో పనిచేయాడానికి రిపోర్టర్2లు కావలెను. ఆర్హత.. ఏదైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే. ఆసక్తి గలవారు ఈ <>లింక్‌లో<<>> తమ పేర్లు నమోదు చేసుకోగలరు.

News January 9, 2026

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

image

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ జిల్లా కార్యాలయ భవన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పణ విషయంలో జరిగిన జాప్యంపై సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు పట్టవా..? అంటూ కమిషనర్‌ను నిలదీసింది. జాప్యానికి గల కారణాలపై వెంటనే అఫిడవిట్ వేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.

News January 8, 2026

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అమరావతి రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్‌తో కలిసి పాల్గొన్నారు.