News December 23, 2024

సంక్రాంతికి రెడీ అవుతున్న కోళ్లు

image

కోడి పందేలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. సంక్రాంతి వస్తుందంటే మూడు రోజులు పందేలు జోరుగా సాగుతుంటాయి. గెలుపే లక్ష్యంగా కోళ్లను సిద్దం చేస్తున్నారు. బలమైన ఆహారాన్ని తినిపించడంతో పాటు, కొలనులలో ఈత కొట్టించడం, వాకింగ్ చేయించడం చేస్తున్నారు. భీమవరం, నరసాపురం, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమల, తాడేపల్లిగూడెంలో పందాలు జరుగుతుంటాయి. పందేలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

Similar News

News January 19, 2025

టి. నరసాపురంలో బాలిక అనుమానాస్పద మృతి

image

టి.నరసాపురంలో బాలిక మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. మండలానికి చెందిన బాలిక అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. అయితే బాత్ రూమ్‌కి అని వెళ్లిన బాలిక స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన తల్లిదండ్రులు చింతలపూడికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించి, ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందినట్లు నిర్ధారించారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News January 19, 2025

ఉమ్మడి ప.గో జిల్లాలో రూ. 120 కోట్ల మద్యం విక్రయాలు

image

ఉమ్మడి ప.గో జిల్లాలో సంక్రాంతి సంబరాలు మూడు రోజులూ వైభవంగా జరిగాయి. అదే రీతిలో మద్యం ప్రియులు మద్యం కోసం ఎగబడ్డారు. సుదూర ప్రాంతాల నుంచి బంధువులు , స్నేహితులు పండుగకు ముందుగానే పల్లె బాట పట్టారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 15వ తేదీ వరకు రూ. 120 కోట్లకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు.

News January 19, 2025

భీమవరం: వ్యక్తి కిడ్నాప్‌లో ట్విస్ట్

image

భీమవరంలో ఈనెల 16న వెంకట సత్యనారాయణ(నాని) కిడ్నాపైన విషయం తెలిసిందే. అయితే కిడ్నాప్‌కు అనంతపురం వాసులు ఇద్దరితో ఆర్థిక లావాదేవీలే కారణమని తెలుస్తోంది. నానిని కిడ్నాప్ చేసి బకాయిలు వసూలు చేయాలని పథకం వేశారు. రైల్వే స్టేషన్ వద్ద ఒంటరిగా ఉన్న అతడిని ఇంటిలిజెన్స్ పోలీసులమని చెప్పి కిడ్నాప్ చేశారు. నాని కుమారుడి ఫిర్యాదులో రంగంలోకి దిగిన పోలీసులు కేసును చేధించారు. త్వరలో నిందితులను చూపించే ఛాన్స్ ఉంది.