News January 26, 2025
సంక్రాంతి తర్వాత టీచర్లే రాలేదు: రాళ్లగడ్డ సర్పంచ్

గూడెంకొత్తవీధి మండలం దుప్పులవాడ పంచాయతీ రాళ్లగడ్డ ప్రభుత్వ పాఠశాలను సంక్రాంతి సెలవుల తర్వాత తిరిగి తెరవలేదని సర్పంచ్, విద్యా కమిటీ ఛైర్మన్ కేలేబు కుమారి ఆరోపించారు. విద్యార్థులను దారిలో పెట్టాల్సిన టీచర్లే స్కూల్కు డుమ్మా కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఫలితంగా ఆదివాసీ బిడ్డలు చదువుకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News October 19, 2025
గద్వాల్: విజిలెన్స్ దాడులు.. రూ.2కోట్ల ధాన్యం మాయం

గద్వాలలోని శ్రీరామ రైసు మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు నిన్న రాత్రి వరకు నిర్వహించిన దాడులు పెను సంచలనం సృష్టించాయి. ప్రభుత్వానికి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద అందించాల్సిన రూ.2 కోట్ల విలువైన 26 వేల బస్తాల ధాన్యం మిల్లులో నిల్వ లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. ధాన్యం మాయంపై విజిలెన్స్ అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
News October 19, 2025
నేడు అనంతపురంలో సందడి చేయనున్న సినీ నటి మీనాక్షి

సంక్రాంతికి వస్తున్నాం సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం జిల్లాకు రానున్నారు. అనంతపురంలోని రాజీవ్ కాలనీలో ఓ షోరూం ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.
News October 19, 2025
జనగామ: త్వరలో కొత్త పంచాయతీ అధికారి

త్వరలో జనగామ జిల్లాకు కొత్త పంచాయతీ అధికారి రానున్నారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాలకు కొత్త డీపీవోలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇటీవల గ్రూప్- 1లో ఎంపికైన ఎ.నవీన్ను జనగామకు నియమించారు. ప్రస్తుతం శిక్షణలో ఉన్నందున శిక్షణ అనంతరం విధుల్లో చేరనున్నారు.