News January 10, 2026

సంక్రాంతి ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి: మణుగూరు డీఎస్పీ

image

సంక్రాంతి పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మణుగూరు DSP రవీందర్ రెడ్డి సూచించారు. ఖాళీగా ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు పడే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచవద్దని, సీసీ కెమెరాలు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Similar News

News January 14, 2026

పసిడిని మించిన ప్రసాదం.. మేడారం ‘బంగారం’

image

తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర అంటేనే మనకు గుర్తొచ్చేది ‘బంగారం’. ఇక్కడ బంగారం అంటే పసిడి కాదు.. సాక్షాత్తు బెల్లం. రాబోయే జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మహా జాతరలో కోట్లాది మంది భక్తులు అమ్మవార్లకు సమర్పించే అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం ఇదే. భక్తులు తమ బరువును తూచుకొని తమ బరువుకు సమానమైన బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పిస్తారు. దీన్నే ‘నిలువెత్తు బంగారం’ అంటారు.

News January 14, 2026

3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

image

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేటి నుంచి 3 రోజుల పాటు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11:30 గంటలకు మధిర చేరుకుంటారు. అక్కడ అధికారులు, ప్రజలతో భేటీ అవుతారు. గురువారం సంక్రాంతి వేడుకల్లో పాల్గొని, శుక్రవారం స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కావున అధికారులు, కార్యకర్తలు గమనించి డిప్యూటీ సీఎం పర్యటన విజయవంతం చేయాలని క్యాంపు కార్యాలయ ఇన్‌ఛార్జ్ కోరారు.

News January 14, 2026

ADB: చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు

image

చైనా మాంజా తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన ఆదిలాబాద్‌లోని నేషనల్ మార్ట్ సమీపంలో చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న సంతోష్ మంగళవారం సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని కాలనీవాసులు తెలిపారు. ఈ మేరకు అతడిని రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.