News December 15, 2024
సంక్రాంతి సంబరం.. సరిగ్గా మరో నెల

సంక్రాంతి సంబరాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రకృతి సోయగాలతో అలరించే ఇక్కడి పల్లెటూర్లు పండుగ శోభతో మరింత వన్నె సంతరించుకుంటాయి. రక్తి కట్టించే కోళ్ల పందేలతో తూ.గో, ప.గో జిల్లాల పేర్లు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగుతాయి. కొత్త అల్లుళ్లకు చేసే వినూత్న మర్యాదలు మరో స్పెషల్ అట్రాక్షన్. రంగ వల్లులు, ఉత్సవాలు, ఉద్యోగాలకు పట్నం వెళ్లిన వారి రాకతో సరిగ్గా మరో నెలలో పల్లెలు కళకళలాడనున్నాయి.
Similar News
News October 16, 2025
తణుకు: బీజేపీ జాతీయ మీడియా అధికార ప్రతినిధిగా రేణుక

తణుకునకు చెందిన ముళ్లపూడి రేణుక బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధి నుంచి జాతీయ మీడియా ప్రతినిధిగా, రాష్ట్ర బీజేపీ మీడియా అధికార ప్రతినిధిగా పాలకొల్లుకు చెందిన ఉన్నమట్ల కభర్దిలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ బుధవారం నియమించారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు ఇరువురు నాయకులను అభినందించారు.
News October 15, 2025
పాలకొల్లు: లారీ, బైక్ ఢీ.. పురోహితుడు మృతి

పాలకొల్లులోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మెయిన్ రోడ్డుపై బుధవారం బైక్, లారీ ఢీ కొన్న ఘటనలో పురుహితుడు శివకోటి అప్పారావు (60) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాలమేరకు.. జిన్నూరు గ్రామానికి చెందిన అప్పారావు ఎక్సెల్ మోటార్ సైకిల్ వాహనంపై ప్రయాణిస్తుండగా లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు.
News October 15, 2025
భీమవరం: జిల్లాలో పర్యాటకాభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

భీమవరం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం బీచ్ రిసార్ట్స్‌కు మౌలిక వసతులు కల్పించే అంశంపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పర్యాటకం విస్తృతంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. దీనిలో భాగంగా, సముద్ర తీర ప్రాంతాన్ని ఆనుకొని పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తున్న రిసార్ట్స్‌కు తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని అవసరం ఉందన్నారు.