News April 29, 2024
సంక్షేమ నిధిని మళ్లించకుండా చూస్తాం: పవన్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాగానే ఎవరూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని డైవర్ట్ చేయకుండా చూస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. సోమవారం రాత్రి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి రూ.కోటి విరాళాన్ని ప్రకటించారు. బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జి, తాతాజీ పాల్గొన్నారు.
Similar News
News April 16, 2026
రేపు ప.గో జిల్లాలో అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

భీమవరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 11 గంటలకు గంగానమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు.

ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్య: కలెక్టర్ నాగరాణి

భీమవరం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ నాగరాణి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. అనంతరం ‘మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన విద్యాబోధన అందుతోందని కలెక్టర్ స్పష్టం చేశారు.