News January 22, 2025
సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలి: కలెక్టర్

ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ ప్రజలను కోరారు. బుధవారం చివ్వెంల మండలంలో వట్టి ఖంపహాడ్ గ్రామం పంచాయతీ కార్యాలయంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో ఆయన మాట్లాడారు. అర్హులై ఉండి సంక్షేమ పథకాల జాబితాలో పేరు లేని వారికి గ్రామ సభల వద్దనే ప్రత్యేక దరఖాస్తులు అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వేణుమాధవ్ ఉన్నారు.
Similar News
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.
News December 1, 2025
HYD: త్వరలో ఈ ప్రాంతల్లో సైతం జలమండలి..!

ORR బయట, లోపల ఉన్న ఏరియాలను సైతం జలమండలిలోకి కలపటం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధం చేస్తుంది. శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, పెద్ద అంబర్పేట్, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తూముకుంట, తెల్లాపూర్, అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ORR చుట్టూ లోపల, బయట విస్తరించనుంది. డ్రింకింగ్ వాటర్, డ్రైనేజీ కనెక్షన్స్ ఇక జలమండలి పరిధిలోకి రానున్నాయి.
News December 1, 2025
తుఫాన్ ఎఫెక్ట్.. రూ.700కు చేరిన టమాటా

దిత్వా తుఫాను ఎఫెక్ట్ టమాటా ధరలపై పడింది. పుంగనూరు మార్కెట్లో సోమవారం 15 కిలోల టమాటా బాక్స్ రూ.700 పలికింది. 66.19 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. రెండో రకం రూ.500, మూడో రకం రూ.350 చొప్పున వ్యాపారులు రైతుల నుంచి కొనుగోలు చేశారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధరలు పెరిగినట్లు రైతులు తెలిపారు.


