News January 23, 2025

సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

గ్రామంలో సాగు యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తున్నామని, అలాంటివి ఏమైనా ఉంటే గ్రామసభల్లో తెలియజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిజమైన లబ్దిదారులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 8, 2025

పీజీఆర్ఎస్ అర్జీల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: కలెక్టర్

image

పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి 82 వినతులు సేకరించారు. పీజీఆర్ఎస్ అర్జీలను ఆడిట్ చేయడం జరుగుతుందని, కావున జిల్లా అధికారులు వీటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ పరిష్కరించాలని తెలిపారు.

News December 8, 2025

స్కూళ్లకు సెలవులపై ప్రకటన

image

TG: ఈ నెల 11న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో స్కూళ్లకు రెండు రోజులు సెలవు ఇస్తూ డీఈవోలు ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే పాఠశాలలకు 10, 11న సెలవు ఉంటుందని పేర్కొన్నారు. 10న పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్ల దృష్ట్యా, 11న పోలింగ్ ఉండటంతో సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తొలి విడతలో 4,236 గ్రామాల్లో పోలింగ్ జరగనుండగా ఉపాధ్యాయులు విధుల్లో పాల్గొననున్నారు.

News December 8, 2025

ఎచ్చెర్ల: పీజీలో సీట్లకు ప్రవేశాలు

image

డా. బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ, ఎచ్చెర్లలో వివిధ పీజీ కోర్సుల్లో (ఎం.ఎ, ఎం.కాం, ఎం.ఎస్సీ, ఎం.ఇడి) మిగిలిన సీట్లకు తక్షణ ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ బి. అడ్డయ్య సోమవారం తెలిపారు. ఈ ప్రవేశాలు ఈ నెల 9న మంగళవారం నుంచి క్యాంపస్‌లో జరుగుతాయన్నారు. ఏపీపీజీసెట్ రాసినా, రాయకపోయినా సీటు పొందని వారు ఈ స్పాట్ అడ్మిషన్స్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు.