News January 23, 2025

సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

గ్రామంలో సాగు యోగ్యం కానీ భూములను రైతు భరోసా నుంచి తొలగిస్తున్నామని, అలాంటివి ఏమైనా ఉంటే గ్రామసభల్లో తెలియజేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. బుధవారం గోపాల్‌పేట మండలం తాడిపర్తి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిజమైన లబ్దిదారులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News February 17, 2025

TODAY HEADLINES

image

* అధికారులు ఏసీ గదులను వదలాలి: CM రేవంత్
* తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రం: కేటీఆర్
* సీఎం రేవంత్‌కు సబ్జెక్ట్ లేదు: ఎంపీ అర్వింద్
* APలో GBSతో తొలి మరణం
* ప్రతి ఎన్నికలో గెలవాల్సిందే: సీఎం చంద్రబాబు
* ఏప్రిల్‌లో మత్స్యకారులకు రూ.20వేలు: మంత్రి నిమ్మల
* IPL-2025 షెడ్యూల్ విడుదల
* న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాటలో 18మంది మృతి
* మరో 112 మందితో భారత్‌ చేరుకున్న US ఫ్లైట్

News February 17, 2025

IPL.. ఈ జట్లకు కెప్టెన్లు ఎవరు?

image

IPL-2025 మార్చి 22న ప్రారంభం కానుంది. ఇటీవలి వేలంలో పలువురు ప్లేయర్లు, కెప్టెన్లు ఆయా ఫ్రాంచైజీలను వీడారు. RCB తమ కెప్టెన్‌గా రజత్ పాటీదార్‌ను ప్రకటించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా తమ కెప్టెన్లను ప్రకటించలేదు. KKRలో రహానే, వెంకటేశ్ అయ్యర్, నరైన్, రింకూ.. DCలో KL రాహుల్, అక్షర్ పటేల్, డుప్లిసెస్ కెప్టెన్సీ రేసులో ఉన్నారు. వీరిలో కెప్టెన్సీ ఎవరికి దక్కుతుందో కామెంట్ చేయండి.

News February 17, 2025

ఢిల్లీలో తొక్కిసలాట.. రైల్వేశాఖ అప్రమత్తం

image

ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. న్యూఢిల్లీతో పాటు ప్రయాగ్‌రాజ్, వారణాసి, అయోధ్య, కాన్పూర్, లక్నో, మిర్జాపూర్ రైల్వే స్టేషన్లలో GRP, RPF పోలీసులను భారీగా మోహరించారు. స్టేషన్ బయటే ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తున్నారు. వాహనాలను స్టేషన్ల సమీపంలోకి అనుమతించడంలేదు. రైలు వచ్చాక ప్లాట్‌ఫాంపైకి ప్రయాణికులను అనుమతిస్తున్నారు.

error: Content is protected !!