News January 26, 2025
సంక్షేమ పథకాలను ప్రారంభించిన వేం నరేందర్ రెడ్డి

నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అని ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 4 సంక్షేమ పథకాలను మండలంలోని గాంధీనగర్‌లో వేం నరేందర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మురళి నాయక్, ఎంపీ బలరాం నాయక్ ప్రారంభించారు. కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ కేకన్, మార్కెట్ ఛైర్మన్ సంజీవరెడ్డి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 15, 2025
OFFICIAL: CSK కెప్టెన్‌గా గైక్వాడ్

IPL 2026 కోసం CSK కెప్టెన్‌ను ఆ జట్టు యాజమాన్యం కన్ఫామ్ చేసింది. తదుపరి సీజన్‌కు తమ కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్ ఉంటారని X వేదికగా వెల్లడించింది. దీంతో సంజూ శాంసన్‌ను కెప్టెన్‌గా ప్రకటిస్తారనే ఊహాగానాలకు తెరదించినట్లైంది. CSK సంజూ శాంసన్‌ను తీసుకుని, రవీంద్ర జడేజా, సామ్ కర్రన్‌ను RRకు ఇచ్చి ట్రేడ్ డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.
News November 15, 2025
HYD: శుభం, శోకంలో వారితో గండమే!

ఇంట్లో శుభకార్యమైనా, శోకసంద్రమైనా వారి ఆగడాలు ప్రజలకు శాపంగా మారాయి. దావత్ చేస్తే హిజ్రాలు ఆటోలో వచ్చి హంగామా సృష్టిస్తున్నారు. రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నారు. నిరాకరిస్తే దాడులకు దిగుతున్నారు. ఇటీవల చీర్యాలలో గృహయజమానిపై జరిగిన దాడి కలకలం రేపింది. శోకసమయంలో కాటికాపరుల దుశ్చర్యలూ ఆగడం లేదు. దశదిన కర్మలకు శ్మశానాలకే వెళ్లి వేలకు వేలు గుంజేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు.