News February 20, 2025
సంక్షేమ హాస్టల్పై రోజువారి నివేదిక అందించాలి: కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో సంక్షేమ హాస్టళ్లపై ప్రత్యేక అధికారులతో జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాలను రానున్న మూడు రోజులు హాస్టల్లో ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తహసిల్దార్లు ఎంపీడీవోల సంబంధంతో విస్తృతంగా సందర్శించి రోజువారి నివేదికలను అందించాలన్నారు. హాస్టళ్లలో విద్యార్థులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.
Similar News
News October 26, 2025
HYD: NIMSకి పెరుగుతున్న రోగుల తాకిడి

పంజాగుట్ట NIMS హాస్పటల్లో ఉదయం సమయాల్లో రోగుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకంగా మెడికల్ కౌంటర్, ల్యాబ్, ఫార్మసీ వద్ద వైద్య సేవలకు వస్తున్న రోగులు ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బందులు తప్పటం లేదు. అధికారులు అవసరమైతే అదనపు సిబ్బంది, కౌంటర్లు ఏర్పాటు చేసి, వేగవంతమైన సేవలు అందించడం ద్వారా రోగుల భద్రత, సౌకర్యాన్ని పరిరక్షించాలని కోరుతున్నారు.
News October 26, 2025
కరీంనగర్: రేపటి ప్రజావాణి రద్దు.. ఎందుకంటే..?

కరీంనగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణి నిర్వహించే ఆడిటోరియంలో మద్యం దుకాణాల టెండర్కు సంబంధించిన లాటరీ కార్యక్రమం ఏర్పాటు చేసినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు ఈ అంతరాయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.
News October 26, 2025
ఎంజీఎం: ఇద్దరు చిన్నారులకు ఒకటే సిలిండర్.. కేటీఆర్ ట్వీట్

సర్కారు దవాఖానాలో సరిపోను ఆక్సిజన్ సిలిండర్లు లేక ఇద్దరు చిన్నారులకు ఒకటే సిలిండర్ పెట్టిన దుస్థితి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. పాలన పడకేసి ప్రజలు అష్ట కష్టాలు పడుతుంటే కాంగ్రెస్ పాలకులేమో కప్పం కట్టడానికి ఢిల్లీ బాట పట్టారని మండిపడ్డారు.


