News August 5, 2024

సంగం: ఐటీఐలో చేరేందుకు దరఖాస్తుల ఆహ్వానం

image

సంగం పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఖాళీగా ఉన్న సీట్లకు మూడో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఏడుకొండలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫిట్టర్ విభాగంలో సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News December 15, 2025

నెల్లూరు మేయర్ రాజీనామా ఆమోదం

image

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొకుండానే సొంత నిర్ణయం తీసుకున్నారు. మేయర్ తన ప్రతినిధి ద్వారా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాజీనామా లేఖను అందించారు. ఆ రాజీనామాకు ఆమోద ముద్ర పడింది. 18న కార్పొరేషన్‌ కౌన్సిల్ సాధారణ సమావేశం జరపనున్నారు.

News December 15, 2025

నేడు వైసీపీ ఆధ్వర్యంలో నెల్లూరులో భారీ ర్యాలీ

image

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని సంబంధించిన పత్రాలను జిల్లా నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపే కార్యక్రమం నెల్లూరులో సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో బైకులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.