News September 18, 2024

సంగం: కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

image

ఏఎస్ పేటలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేశ్ సంగం మండలం పడమటిపాలెంలో మంగళవారం సాయంత్రం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆత్మహత్యాయత్నానికి వ్యవసాయంలో వచ్చిన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం బుచ్చి నుంచి నెల్లూరుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమేశ్ స్వగ్రామం విడవలూరు.

Similar News

News November 23, 2025

నిరుద్యోగ యువతకు ఈ సంస్థ గురించి తెలుసా.?

image

గ్రామీణ నిరుద్యోగ యువతకు వెంకటాచలంలో ఉన్న స్వర్ణభారత్–సోమా సాంకేతిక శిక్షణా సంస్థ ఓ ఆశాదీపంగా నిలిచింది. డిమాండ్ ఉన్న రంగాలలో సాంకేతిక నిపుణులతో ఉచిత శిక్షణ ఇచ్చి యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. గడచిన 14 ఏళ్లలో 5,420 మంది ఇక్కడ శిక్షణ పొందగా 80% మందికి పైగా యువకులు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు పొందినట్లు సమాచారం. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కూడా కల్పిస్తున్నారు.

News November 23, 2025

కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

News November 23, 2025

నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

image

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.