News January 4, 2025

సంగం: హైవేపై ఘోర ప్రమాదం.. ఒకరి మృతి

image

ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన శనివారం సంగం మండలం వెంగారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. భార్యాభర్తలు ప్రయాణిస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆటో డ్రైవర్ భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు. ఆటో ముందు భాగం నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 24, 2025

గూడూరుకు నేడు జిల్లా కలెక్టర్ రాక

image

శుక్రవారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ రేపు గూడూరు డివిజన్ కు రానున్నారు. చిల్లకూరు సాగరమాల జాతీయ రహదారి package-4 నిర్మాణ పనులు పరిశీలించుటకు రానున్నట్లు తెలుస్తోంది. సాగరమాల జాతీయ రహదారి నిర్మాణ పనులు ఇప్పటివరకు ఎంతమేరకు జరిగాయి అన్న వివరాలు తెలుసుకునేందుకు రానున్నట్లు తెలుస్తోంది.

News January 23, 2025

ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలు

image

నెల్లూరు జిల్లాలో ఆన్‌లైన్ మోసాలు రోజుకొక కొత్త రూపు సంతరించుకుంటున్నాయి. తాజాగా ఉదయగిరిలో నకిలీ ఫోన్‌పే యాప్‌తో మోసాలకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పట్టణంలోని ఓ మద్యం దుకాణంలో రూ.4 వేలకుపైగా మద్యం కొనుగోలు చేసి ఫోన్‌పే ద్వారా నగదు పంపించాడు. అయితే డబ్బులు రాకపోవడంతో అనుమానించిన దుకాణం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.

News January 23, 2025

వివిధ రకాల ఉద్యోగాలకు మెరిట్ జాబితా విడుదల

image

నెల్లూరు నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వివిధ రకాల ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ జాబితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాజమన్నార్ తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను spsrnellore.ap.gov.in అనే వెబ్సైట్లో పొందుపరిచారన్నారు. మెరిట్ జాబితాలో అభ్యంతరాలు ఉంటే గ్రీవెన్స్ ద్వారా తెలియపరచాలన్నారు.