News February 12, 2026
సంగాం సంగమేశ్వర స్వామి ఆలయ విశిష్టత(1/1)

వంగర మండలంలోని సంగాం సంగమేశ్వర స్వామి ఆలయం అతి విశిష్టమైనది. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు నిర్మించారు. ద్వాపర యుగంలో బలరామకృష్ణులు హిందూ దేశాన్ని పరిపాలిస్తుండగా బలరాముడు బ్రహ్మను హత్య చేశాడు. దీనికి ప్రాయశ్చిత్తంగా మహాశివరాత్రి రోజున దేవతలు గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుషాదుల సమక్షంలో పాయకపాడు, గుంప, సంగాం, శ్రీకాకుళం, కల్లేపల్లిలో ఆలయాలు నిర్మించారు.
Similar News
News March 9, 2026
విమానాశ్రయం ద్వారా నేడు ఎంతమంది ప్రయాణించారంటే..!

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా సోమవారం 40 విమాన సర్వీసులు ప్రయాణించాయని గన్నవరంలోని ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వీటిలో 20 సర్వీసుల ద్వారా 1,836 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 2,111 మంది 20 సర్వీసులలో ప్రయాణించారని తెలిపింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను నిర్వహిస్తున్నామంది.
News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 9, 2026
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ మాకవరపాలెంలో పరిశ్రమలు ఏర్పాటుకు 4259 ఎకరాల భూమి సేకరణకు స్థల పరిశీలన
➤ గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష
➤ బాలుడి మృతికి నాటు తుపాకీ పేలుడే కారణం
➤ అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు: ఎస్పీ
➤ పుత్తడి గైరంపేటలో గుండెపోటుతో యువకుడు మృతి
➤ శృంగవరంలో పర్యటించిన కేంద్ర బృందం
➤ ఎరకన్నపాలెం టూ పెద్దపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
➤PGRS లో ఫిర్యాదుల వెల్లువ


