News February 26, 2025

సంగారెడ్డి:ఈనెల 28 నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా నూతనంగా విధులలో చేరిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఈనెల 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు విద్యాబోధన అంశాలపైన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్, బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

ములుగు జిల్లాలో ‘ఆమె’ ఓట్లే అధికం..!

image

ములుగు జిల్లాలోని 10 మండలాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో మొత్తం 2,29,159 ఓటర్లు ఉండగా, అందులో 1,10,838 మంది పురుషులు, 1,18,299 మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే 7,461 మంది మహిళలు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మంగపేటలో 19,913 మహిళా ఓటర్లు ఉండగా, అత్యల్పంగా కన్నాయిగూడెంలో 5,085 మహిళా ఓటర్లు ఉన్నారు.

News November 27, 2025

పీరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్ అవుతోందా?

image

పీరియడ్స్‌లో 1-3 రోజులకు మించి హెవీ బ్లీడింగ్ అవుతుంటే నిర్లక్ష్యం చేయకూడదంటున్నారు నిపుణులు. ఫైబ్రాయిడ్స్‌, ప్రెగ్నెన్సీ సమస్యలు, పీసీఓఎస్‌, ఐయూడీ, క్యాన్సర్ దీనికి కారణం కావొచ్చు. కాబట్టి సమస్య ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. దీన్ని గుర్తించడానికి రక్త పరీక్ష, పాప్‌స్మియర్‌, ఎండోమెట్రియల్‌ బయాప్సీ, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, సోనోహిస్టరోగ్రామ్‌, హిస్టరోస్కోపీ, D&C పరీక్షలు చేస్తారు.

News November 27, 2025

మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>మెదక్ <<>>ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 30 కాంట్రాక్ట్ డిప్యూటీ మేనేజర్, జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంటెక్, AMIE ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 21 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.300. జీతం నెలకు రూ.30వేలు+IDA చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ddpdoo.gov.in