News February 26, 2025
సంగారెడ్డి:ఈనెల 28 నుంచి నూతన ఉపాధ్యాయులకు శిక్షణ

సంగారెడ్డి జిల్లాలో డీఎస్సీ 2024 ద్వారా నూతనంగా విధులలో చేరిన ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఈనెల 28 నుంచి మార్చి 3వ తేదీ వరకు విద్యాబోధన అంశాలపైన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలోని సైన్స్ సెంటర్, బీసీ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2025
నాగర్‌కర్నూల్: కరుడుగట్టిన నిందితుడికి రిమాండ్

నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని వివిధ మండలాలతోపాటు స్థానికంగా పలు చోరీలకు పాల్పడిన నిందితుడిని రిమాండ్ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నియోజకవర్గంలో దొంగతనాలు పెరిగిపోవడంతో జిల్లా పోలీసు అధికారి ఆదేశానుసారం పాలమూరు చౌరస్తాలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పోలీసులను చూసిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు పంపించారు.
News March 21, 2025
నారాయణపేట జిల్లా ఎస్పీ WARNING

నేటి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షకు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేశ్ గౌతమ్ తెలిపారు. మొత్తం 39 పరీక్ష కేంద్రాల్లో 7,631 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా ఎవరూ తిరగవద్దని హెచ్చరించారు. పరీక్ష కేంద్రాలకు సమీపంలో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించొద్దని సూచించారు.
News March 21, 2025
మార్చి21: చరిత్రలో ఈరోజు

*1916: సెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జననం *1933: పేరిణి శివతాండవ నాట్యచారుడు నటరాజ రామకృష్ణ జననం *1970: హీరోయిన్ శోభన జననం *1978: ప్రముఖ సినీనటి రాణి ముఖర్జీ జననం
ప్రపంచ అటవీ దినోత్సవం
ప్రపంచ కవితా దినోత్సవం
ప్రపంచ జాతి వివక్ష నిర్మూలన దినోత్సవం