News March 12, 2025
సంగారెడ్డిలో ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో ఈనెల ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు ఈనెల 22వ తేదీ వరకు జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాలను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు.
Similar News
News November 14, 2025
హత్య కేసులో జైలుకు.. MLAగా విజయం

హత్య కేసులో అరెస్టై జైలులో ఉన్న NDA అభ్యర్థి, జేడీ(యూ) నేత అనంత్ కుమార్ సింగ్ MLAగా విజయం సాధించారు. బిహార్ మోకామా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిపై 28,206 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. జన్ సురాజ్ పార్టీ పోల్ వర్కర్ దులార్ చంద్ యాదవ్ మర్డర్ కేసులో నవంబర్ 2న అరెస్టయ్యారు. అనంత్ కుమార్ సింగ్కు 91,416, వీణా దేవికి 63,210 ఓట్లు దక్కాయి.
News November 14, 2025
నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలి: DM&HO

మాతా శిశు సేవల ద్వారా గర్భిణులను గుర్తించి సకాలంలో రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మాతా శిశువులకు నిర్ధేశించిన సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని సూచించారు. ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలన్నారు.
News November 14, 2025
18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: CBN

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.


