News February 25, 2026

సంగారెడ్డిలో ఈనెల 27న జాబ్ మేళా

image

సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీల భర్తీకి 18 నుంచి 35 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 08455-271010 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Similar News

News April 20, 2026

పాలమూరు: నేటి నుంచి పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి

image

ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణా ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమవుతున్నట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ యం.శివయ్య ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, టెన్త్ పరీక్షలు 19 పరీక్ష కేంద్రాల్లో 3,389, ఇంటర్ పరీక్షలు 29 పరీక్ష కేంద్రాల్లో 5,782 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు వెల్లడించారు.

News April 20, 2026

CM బర్త్ డే.. ప్రత్యేక కార్యక్రమంతో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

image

సీఎం చంద్రబాబు జన్మదినం పురస్కరించుకుని కళ్యాణదుర్గం ప్రజావేదిక వద్ద ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 8 వేల మందితో రక్తదానం చేయించాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రక్తదానం చేసిన దాతలకు రూ.3 లక్షల ప్రమాద బీమా పత్రం, స్టీల్ వాటర్ బాటిల్‌ను ఆయన అందజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో యువత పాల్గొని రక్తదానం చేస్తున్నారు.

News April 20, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

image

భద్రాద్రి జిల్లాలో నేటి నుంచి ఈ నెల 26 తేది వరకు రెండు సెషన్స్‌లో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు డిఈఓ నాగలక్ష్మి తెలిపారు. పరీక్షల కోసం కొత్తగూడెంలో 10 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పదో తరగతి అభ్యర్థులు 1045, ఇంటర్ 1196 మంది పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు.10మంది చీఫ్ సూపర్డెంట్లు, 10మంది డిపార్ట్మెంట్ల అధికారులు, 140 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు.