News April 15, 2025
సంగారెడ్డిలో గృహిణి అదృశ్యం.. కేసు నమోదు

గృహిణి అదృశ్యమైన ఘటన సంగారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. పుల్కల్ మండలం బస్వాపూర్‌కు చెందిన సరళ (30) భర్తతో గొడవపడి ఈనెల 11న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో చుట్టుపక్కల వెతికిన ఆచూకీ లభించలేదు. భర్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 26, 2026
ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఐదుగురు డీఎస్పీల బదిలీ

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ బదిలీలు చేపట్టినట్లు వెల్లడించారు. బదిలీ అయిన వారిలో సౌత్ ఏసీపీ పవన్ కుమార్, ఎస్బీ ఏసీపీ భాను, అవనిగడ్డ డీఎస్పీ విద్య శ్రీ, మచిలీపట్నం డీఎస్పీ రాజా, గుడివాడ డీఎస్పీ వినీల్ ఉన్నారు. డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News February 26, 2026
ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

టారిఫ్‌ల విషయంలో <<19195677>>ఎదురుదెబ్బ<<>> తిన్న US అధ్యక్షుడు ట్రంప్‌కు మరో షాక్ తగిలింది. అక్రమ వలసదారులను వారి దేశాలకు కాకుండా ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. వారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం సరికాదని, చట్టబద్ధత కూడా లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని సస్పెండ్ చేస్తూ తీర్పునిచ్చింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడానికి అవకాశమిచ్చింది.
News February 26, 2026
తీర్థం ఎందుకు తీసుకోవాలి?

తీర్థం తీసుకోవడం వెనుక ఆధ్యాత్మిక, ఆరోగ్య కారణాలున్నాయి. తీర్థం సకల పాపాలను హరించి, అకాల మరణం కలగకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో ఉంచే తీర్థం రోగనిరోధక శక్తిని పెంచి, అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది మంత్రోక్తమైన దైవ శక్తిని కలిగి ఉంటుందని పండితులు మాట. ‘తీర్థం తీసుకుంటే మనసు ప్రశాంతమవుతుంది. ఆత్మశుద్ధి కలుగుతుంది. ఏ గుడికి వెళ్లినా తీర్థం తప్పక తీసుకోవాలి’ అంటున్నారు.


