News February 6, 2025
సంగారెడ్డిలో తగ్గిన చికెన్ ధరలు

సంగారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు తగ్గాయి. వారం రోజుల క్రితం కిలో రూ.220పైగానే అమ్మారు. గురువారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. కిలో స్కిన్లెస్ KG రూ.210 నుంచి రూ.220, విత్ స్కిన్ రూ.180 నుంచి రూ.190 మధ్య విక్రయిస్తున్నారు. హోల్ సేల్ దుకాణాల్లో రూ.5 నుంచి రూ.10 వరకు తగ్గించి అమ్ముతున్నారు. పౌల్ట్రీ పరిశ్రమల్లో H5N1 వైరస్ వల్ల కోళ్లు చనిపోవడంతో ధరలు తగ్గడానికి కారణమని తెలుస్తోంది.
Similar News
News October 27, 2025
గుంటూరు జిల్లా నిరుద్యోగులకు ముఖ్య గమనిక

జర్మనీలో ఎలక్ట్రిషియన్ ఉద్యోగాల కోసం మైనారిటీ యువతకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అవకాశం కల్పిస్తోంది. ఏపీఎస్ఎస్డీసీ, ఓఎంసీఏపీ, ఐఈఎస్ సంయుక్తంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఐటీఐ, డిప్లొమా అర్హతతో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం, వయస్సు 30 లోపు ఉండాలని అధికారులు తెలిపారు. మొత్తం ఖర్చు రూ.1.15 లక్షలు 3 వాయిదాల్లో చెల్లించాలి. ఆసక్తిగల వారు నవంబర్ 2లోపు naipunuam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News October 27, 2025
ఆంధ్ర విశ్వవిద్యాలయానికి రేపు సెలవు

మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే విద్యార్థులకు తరగతుల రద్దు చేశారు. విద్యార్థులను హాస్టల్స్కు పరిమితం కావాలని అధికారులు సూచించారు. తుఫాను తీవ్రత పెరగడం, వర్షం అధికమవడంతో వర్సిటీ అధికారులు, ఉద్యోగులకు సైతం రేపు సెలవు ప్రకటించారు.
News October 27, 2025
HYD వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులు: మంత్రి

రాబోయే రోజుల్లో తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మారనుందని, HYD వేదికగా రూ.వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ రంగంలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తోందని పేర్కొంటూ, 2030 నాటికి ఈ రంగం విలువ రూ.250 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. ఈ అభివృద్ధి ద్వారా ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరుగుతాయన్నారు.


