News March 29, 2025
సంగారెడ్డిలో దివ్యాంగులకు అవగాహన సదస్సు

ఏప్రిల్ 3 సంగారెడ్డి కలెక్టర్ ఆడిటోరియంలో దివ్యాంగుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులందరికి యుడిఐడి కార్డు గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. కావున జిల్లాలోని దివ్యాంగులంతా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలోని అన్ని మండలాల దివ్యాంగుల సంఘాల నాయకులు హాజరు కావాలన్నారు.
Similar News
News October 27, 2025
బస్సు ప్రమాదం.. ప్రయాణికులకు RTC గమనిక

కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో TGSRTC ప్రకటన జారీ చేసింది. ‘ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా లహరి, రాజధాని వంటి AC బస్సుల్లో వెనుక అత్యవసర ద్వారం, కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు, మంటలు ఆర్పే పరికరాలు, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కుడి వైపు, వెనుక భాగంలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటాయి. RTC బస్సుల్లో ప్రయాణం సురక్షితం’ అని ట్వీట్ చేసింది.
News October 27, 2025
బాపట్ల: అధికారులతో సమావేశమైన ప్రత్యేక అధికారి

బాపట్ల జిల్లాకు ప్రభుత్వం ప్రత్యేక అధికారిని కేటాయించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన వేణుగోపాల్ రెడ్డి ఆదివారం బాపట్ల కలెక్టరేట్కు విచ్చేసి తుపాను నేపథ్యంలో చేపడుతున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తీసుకుంటున్న చర్యలను కలెక్టర్, ఎస్పీ ఆయనకు వివరించారు. తుపాను ప్రభావంతో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా చూడాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
News October 27, 2025
సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించాం: నాదెండ్ల

AP: సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించిన ఏకైక పార్టీ జనసేన అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొట్టే సాయిని శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్గా ఎంపిక చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువతకు తగిన అవకాశం కల్పించాలని Dy.CM పవన్ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమని ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు.


