News March 28, 2025

సంగారెడ్డిలో మరో విషాదం..

image

జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మరణించారు. మృతులను యూపీకి చెందిన బైద్యనాథ్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 1, 2025

NGKL: పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి ఎన్నికల పోరులో నాయకులు

image

NGKL జిల్లాలో జరుగుతున్న GP ఎన్నికలలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న వివిధ పార్టీల నాయకులు ప్రస్తుతం పార్టీ జెండాలు పక్కన పెట్టి కలిసి పని చేస్తున్నారు. కొన్ని గ్రామాలలో బిజెపి, BRS పార్టీల నాయకులు కలిసి ఎన్నికలలో పోటీ చేస్తుండగా, మరికొన్ని చోట్ల కాంగ్రెస్ బీజేపీ నాయకులు కలిసి పోటీ చేస్తున్నారు. పదవుల కోసం ఎంతకైనా దిగజారుతారనే విమర్శలు ఉన్నాయి.

News December 1, 2025

రంప ఏజెన్సీలో హై అలర్ట్!

image

డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టులు PLGA వారోత్సవాలకు పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలలో ఎన్‌కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టులకు ఆ పార్టీ శ్రేణులు నివాళులు అర్పిస్తారు. ఏటా ఈవారోత్సవాలు జరగడం, పోలీసులు అప్రమత్తంగా ఉండడం సాధారణమే అయినప్పటికీ, ఇటీవల జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ల నేపథ్యంలో ఈసారి రంప ఏజెన్సీలో మరింత హైఅలర్ట్ ప్రకటించారు. పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

News December 1, 2025

జగిత్యాల: ‘ఈ సంవత్సరం 83 కేసులు నమోదు’

image

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల కలెక్టరేట్ నుంచి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన ర్యాలీని అదనపు కలెక్టర్ బి.రాజగౌడ్ ప్రారంభించారు. ఎయిడ్స్‌కు నివారణే మేలని, యువత జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జిల్లాలో 2,573 మంది ఏఆర్‌టి చికిత్స పొందుతున్నారని వైద్య అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం 83 కేసులు నమోదయ్యాయని చెప్పారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.