News February 17, 2025
సంగారెడ్డిలో మహిళపై అత్యాచారం.. నిందితుడు తమిళనాడు వాసి !

సంగారెడ్డి మండలం ఫసల్వాది శివారులో గిరిజన మహిళపై శనివారం రాత్రి అత్యాచారం జరిగింది. అల్లాదుర్గం మండలానికి చెందిన గిరిజన దంపతులు అనంతపురం జిల్లా నేరేడుగొండలోని సేవాలాల్ దర్శనానికి పాదయాత్రగా బయలుదేరారు. ఫసల్వాది సమీపంలోకి రాగానే తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డుకున్న భర్తపై దాడి చేశారు. దీనిపై సంగారెడ్డి రూరల్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Similar News
News March 25, 2025
KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
వికారాబాద్: మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మోమిన్పేట్ మండలం మొరంగపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకాని నరేశ్ (24), మంగలి సన్నీ (22) ప్రాణస్నేహితులు. అవసర నిమిత్తం మోమిన్పేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా మొరంగపల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 25, 2025
వనపర్తి జిల్లా ఎండ తీవ్రత ఇలా..

వనపర్తి జిల్లాలో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా నమోదయ్యాయి. పెబ్బేరు, కేతేపల్లిలో 38.4℃, దగడ 38.3, విలియంకొండ 38.2, గోపాలపేట 38.1, పెద్దమండడి, రెమడ్డుల, కనైపల్లి 38, పాన్గల్ 37.8, మదనాపూర్, ఘనపూర్ 37.7, రేవల్లి 37.6, అత్మకూరు, వనపర్తి 37.5, శ్రీరంగాపురం, జానంపేట 37.3, వెల్గొండ, సోలిపూర్ 37.2, అమరచింత 36.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. గత వారంలో తీవ్రమైన ఎండలు ఉండగా.. గత రెండు రోజులుగా తక్కువగా ఉంటున్నాయి.