News February 28, 2025
సంగారెడ్డిలో మహిళ హత్య..UPDATE

సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్‌లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News December 24, 2025
ఐ పోలవరం వద్ద ఘోర ప్రమాదం.. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు మృతి

రంపచోడవరం(M) ఐ పోలవరం వద్ద బైకు, కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులు మృతి చెందారు. ఐ పోలవరం జంక్షన్ సమీపంలో కారు, బైక్ ఢీ కొన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఏడుగురాళ్లపల్లి పంచాయతీ కార్యదర్శి గడ్డం సందీప్ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో మృతిచెందాడు. సీతనపల్లి పంచాయతీ కార్యదర్శి పెయ్యల విద్యాసాగర్‌ను రాజమండ్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
News December 24, 2025
ఓరుగల్లు వాసులకు శుభవార్త.. 27న భూముల అప్పగింత

మామునూరు ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ కోసం భూములను అప్పగించేందుకు ముహూర్తం ఖరారైంది. 230ఎకరాలను సేకరించిన అధికారులు ఈనెల 27న ఎయిర్‌పోర్ట్ అథారిటీకి అప్పగించనున్నట్లు సమాచారం.దీని పరిధిలో ఇప్పటికే 690ఎకరాలు ఉండగా మరో 250ఎకరాలు కావాలని ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి అందించారు. ప్రైవేటు వ్యక్తుల నుంచి 230ఎకరాలు సేకరించగా మిగతా భూమి ప్రభుత్వానికి చెందింది.దీంతో ఓరుగల్లు వాసుల ఎయిర్‌పోర్ట్ కల నెరవేరనుంది.
News December 24, 2025
హోటల్‌గా రుషికొండ ప్యాలెస్.. 28న నిర్ణయం?

AP: రుషికొండ ప్యాలెస్‌ను హోటల్‌గా మార్చే అవకాశం ఉందని మంత్రివర్గ ఉపసంఘం పేర్కొంది. ఇందుకు తాజ్, లీలా ప్యాలెస్, అట్మాస్ కోర్, ఫెమా సంస్థలు ఆసక్తి చూపాయని మంత్రులు కేశవ్, దుర్గేశ్ వెల్లడించారు. ‘మాల్దీవ్, పుదుచ్చేరి బీచ్ హోటల్స్‌పై చర్చించాం. ప్రజలకు పనికొచ్చేలా, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా వినియోగిస్తాం. గత ప్రభుత్వ నిర్ణయంతో నెలకు ₹25L భారం పడుతోంది’ అని చెప్పారు. ఈ 28న మరోసారి చర్చిస్తామన్నారు.


