News February 28, 2025

సంగారెడ్డిలో మహిళ హత్య..UPDATE

image

సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్‌లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 23, 2025

విశాఖ మేయర్ పీఠంపై రాజకీయం

image

AP: విశాఖ మేయర్‌పై కూటమి నేతలు <<15849529>>అవిశ్వాస తీర్మాన<<>> నోటీస్ ఇవ్వడంతో వైసీపీ అప్రమత్తమైంది. ఇవాళ మండలి ప్రతిపక్ష నేత బొత్స, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వైసీపీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. అవిశ్వాసం నెగ్గకుండా ఉండేందుకు సమాలోచనలు చేశారు. అవసరమైతే క్యాంప్ రన్ చేయాలని నిర్ణయించారు. GVMCలో 98 స్థానాలుండగా, వైసీపీ కార్పొరేటర్ల చేరికలతో కూటమి బలం 70(+11 మంది ఎక్స్‌ అఫీషియో సభ్యులు)కి చేరింది.

News March 23, 2025

విశాఖలో IPL మ్యాచ్‌కు స్పెషల్ బస్సులు

image

విశాఖలో సోమవారం జరిగే క్రికెట్ మ్యాచ్‌కు ఏపీఎస్ఆర్టీసీ 30 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ అప్పలనాయుడు ఆదివారం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి మధురవాడ క్రికెట్ స్టేడియానికి నడపనున్నారు. ఈ స్పెషల్ బస్సులు గాజువాక, ఓల్డ్ పోస్ట్ ఆఫీస్, సింహాచలం, కూర్మన్నపాలెం నుంచి మధురవాడకు నడపనున్నట్లు వెల్లడించారు. రద్దీ అనుగుణంగా బస్సులు పెంచుతామన్నారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News March 23, 2025

27న పోలవరానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఈ నెల 27న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పనుల పురోగతి, కేంద్రం నుంచి నిధులను రాబట్టడంపై దిశానిర్దేశం చేయనున్నారు.

error: Content is protected !!