News February 18, 2025
సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు <<15474129>>దారుణ <<>>హత్యకు గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Similar News
News July 6, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విద్యా శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి, రెండో దశలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి గురించిన వివరాలను డీఈవో వాసంతి, ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వివరించారు.
News July 6, 2025
విజయవాడ: స్కిల్ హబ్‌లో పనులకు టెండర్లు

తుళ్లూరులోని అమరావతి స్కిల్ హబ్‌లో కాంక్రీట్ బ్లాక్‌ల పనులు పూర్తి చేసేందుకు CRDA శనివారం టెండర్లు ఆహ్వానించింది. రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల నిమిత్తం గుత్తేదారుల నుంచి టెండర్లు ఆహ్వానిస్తున్నామని విజయవాడలోని CRDA కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 14లోపు ఏపీ ఈ- ప్రాక్యూర్మెంట్ పోర్టల్ ద్వారా బిడ్లను సమర్పించవచ్చని సూచించింది.
News July 6, 2025
ఊపిరి పీల్చుకున్న జపాన్

‘జపాన్ బాబా వాంగా’ <<16947282>>ర్యొ టట్సుకి<<>> జోస్యం చెప్పినట్లుగా ఇవాళ (జులై 5) జపాన్‌లో ఎలాంటి ప్రళయం సంభవించలేదు. అక్కడ 6వ తేదీ రావడంతో ఆ దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ దేశంలో చిన్న భూకంపాలు తప్ప ఎలాంటి సునామీ రాలేదు. దీంతో టట్సుకి భవిష్యవాణి నిరాధారమైందని అక్కడి మేధావులు, సైంటిస్టులు అభిప్రాయపడ్డారు. కాగా ర్యొ టట్సుకి జోస్యంతో జపాన్‌లో ప్రళయం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది.