News February 18, 2025
సంగారెడ్డిలో యువకుడి మర్డర్.. UPDATE

సంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ <<15474129>>హత్యకు<<>> గురైన విషయం తెలిసిందే. తన కూతురితో చనువుగా ఉంటున్నాడన్న కారణంతో నిజాంపేట మండలం రాంచందర్ తండాకు చెందిన లారీ డ్రైవర్ దశరథ్(26)ను ఈనెల 12న అమ్మాయి తండ్రి గోపాల్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గోపాల్, ఆయన భార్య విజ్జీబాయి, మరో ఇద్దరిని నిందితులుగా గుర్తించగా నిన్న అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Similar News
News December 2, 2025
ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు నోటిఫికేషన్

ఏయూలో స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అధికారి టి.చిట్టిబాబు నోటిఫికేషన్ విడుదల చేశారు. 2010-11 సంవత్సరం నుంచి 2025 వరకు డిగ్రీ, పీజీ ప్రవేశం పొందిన విద్యార్థులు స్పెషల్ డ్రైవ్ పరీక్షలకు అర్హులుగా ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 4 నుంచి 26వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఫిబ్రవరి 20వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
News December 2, 2025
భూపాలపల్లి: 3న దివ్యాంగుల దినోత్సవం

జిల్లాలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమావేశం హాల్లో ఈ వేడుక జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లిశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.


