News February 16, 2025

సంగారెడ్డిలో రేపటి ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

కలెక్టరేట్‌లో ఈనెల 17న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. జిల్లాస్థాయి అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లలో ఉన్నందున కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి కలెక్టర్ కార్యాలయానికి ఎవరూ రావద్దని, ప్రజావాణి కార్యక్రమం నిర్వహించే తేదీని మళ్లీ ప్రకటిస్తామని తెలిపారు.

Similar News

News November 21, 2025

HYD: దొంగ నల్లా కనెక్షన్‌పై ఫిర్యాదు చేయండి

image

గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా నల్లా అక్రమ కనెక్షన్లపై అధికారుల రైడ్ కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో దాదాపుగా 50 మందికిపైగా వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ కనెక్షన్లు గుర్తించినా, డొమెస్టిక్ కనెక్షన్ తీసుకున్న వారు, కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తే 99899 98100 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

News November 21, 2025

ఖమ్మం: అనుమానంతో భార్యను కడతేర్చిన వైనం

image

ఖమ్మం గట్టయ్య సెంటర్‌లో తన భార్య సాయి వాణి(33)ని భర్త గోగుల భాస్కర్ కత్తితో గొంతు కోసి చంపడం కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే కొన్నేళ్లుగా అనుమానంతో వేధిస్తున్న భాస్కర్‌కు గతంలో పోలీస్ స్టేషన్లలో కౌన్సెలింగ్‌ ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఏడాదిగా విడిగా ఉంటున్న భార్యను మాటువేసి హతమార్చాడు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతురాలిది APలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట.

News November 21, 2025

కడపలో నేడు వాహనాల వేలం

image

కడప జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలు పట్టుబడ్డాయి. ఈక్రమంలో 9 వాహనాలకు శుక్రవారం ఉదయం 11 గంటలకు వేలం వేయనున్నారు. కడపలోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌ ఆవరణలో జరిగే వేలంలో ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని అధికారులు కోరారు.