News November 15, 2024
సంగారెడ్డిలో లగచర్ల రైతులను కలవనున్న KTR
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నేడు సంగారెడ్డికి రానున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ నాయకుల బృందంతో కలిసి సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఉన్న కొడంగల్ నియోజకవర్గం లగచర్ల గ్రామానికి చెందిన పార్టీ నాయకులు, రైతులను పరామర్శించనున్నారు. వికారాబాద్ జిల్లా అధికారులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన వారిని సంగారెడ్డి జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
Similar News
News December 13, 2024
ఓపెన్ స్కూల్ దరఖాస్తులు ఈనెల 16 వరకు పెంపు
ఓపెన్ స్కూల్ విధానంలో పది, ఇంటర్మీడియట్ చదివేందుకు దరఖాస్తు గడపను ఈనెల 16 వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మీసేవా, ఆన్‌లైన్ కేంద్రాల్లో దరఖాస్తు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సమీపంలోని అధ్యయన కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. అ అవకాశాన్ని గడువును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News December 12, 2024
హీర్యా నాయక్ ఉగ్రవాదా.. లేక దోపిడీ దొంగా..?: హరీశ్ రావు
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఇంత కంటే దారుణం ఏముంటుందని ప్రశ్నించారు. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా అని నిలదీశారు.
News December 12, 2024
మాజీ మంత్రులను అడ్డుకోవడం దుర్మార్గం: హరీశ్ రావు
వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్‌తో ఆసుపత్రి పాలైన గిరిజన బాలికలను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ‘X’ వేదికగా మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామనన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో మహిళ ప్రజా ప్రతినిధులకు ఇస్తున్న గౌరవం ఇదేనా..? అని ప్రశ్నించారు.