News April 2, 2025
సంగారెడ్డిలో 79,987.81 క్వింటాళ్ల సన్న బియ్యం సరఫరా: కలెక్టర్

సంగారాడ్డి జిల్లాలోని 846 రేషన్ దుకాణాల ద్వారా 79,987.81 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం తెలిపారు. జిల్లాలో మొత్తం 3,78,728 రేషన్ కార్డులు ఉన్నట్లు చెప్పారు. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
Similar News
News April 8, 2025
థ్రిల్లింగ్ మ్యాచ్: KKRపై LSG విజయం

కేకేఆర్తో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 239 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన కేకేఆర్ 234 పరుగులు చేసింది. దీంతో LSG 4 పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్లో రహానే (61), వెంకటేశ్ (45) రాణించారు. చివర్లో రింకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.
News April 8, 2025
అనకాపల్లి: ఈ ఏడాది 132 మంది అరెస్ట్

గంజాయి కేసుల్లో ఈ ఏడాది ఇప్పటివరకు 132 మందిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం తెలిపారు. కలెక్టరేట్లో ఆయన మాట్లాడుతూ.. 42 కేసులు నమోదు కాగా 178 మందిని గుర్తించామని కలెక్టర్కు వివరించారు. 3,090 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, 53 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిపై పీడీ యాక్ట్ నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు చెప్పారు.
News April 8, 2025
నల్లజర్ల: పిడుగుపాటుకు ఒకరి మృతి

నల్లజర్ల మండలంలోని కృష్ణం గూడెం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఈదురుగాలులు వీచిన సమయంలో మామిడి చెట్టు కింద ఉన్న వెలగని సత్యనారాయణ అనే వ్యక్తిపై పిడుగు పడి మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటన సోమవారం సాయంత్రం జరిగినట్లు తెలుస్తోంది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.