News April 2, 2025
సంగారెడ్డి: ‘అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించాలి’

బడిబాట కార్యక్రమం మాదిరిగా అంగన్వాడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనిత చంద్రన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతినెల 20న అంగన్వాడి కేంద్రాలను తనిఖీలు చేయాలని చెప్పారు. సమావేశంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి, కలెక్టర్ చంద్రశేఖర్, సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలితకుమారి పాల్గొన్నారు.
Similar News
News November 25, 2025
ఉదయగిరి: ఇల్లు కట్టుకునేవారికి రూ.2.50 లక్షలు

సీఎం చంద్రబాబు సొంత ఇల్లులేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు (గణ) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో మండలంలోని ప్రతి పేద ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తారన్నారు. వివరాలకు సచివాలయంలో సంప్రదించాలన్నారు.
News November 25, 2025
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నేడు విచారణ

ఐబొమ్మ రవి కస్టడీలో సహకరించలేదని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తరఫు న్యాయవాది శ్రీనాథ్ తెలిపారు. మొత్తం ఆయనపై 5 కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఒక్క కేసులో రిమాండ్ విధించారని, మిగతా కేసుల్లో అరెస్టు కోసం సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇవాళ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో విచారణ జరగనున్నట్లు పేర్కొన్నారు.
News November 25, 2025
తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్నెఫ్ట్, ల్యూకోయిల్పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.


