News February 2, 2025
సంగారెడ్డి: అండర్-19 అమ్మాయిల టీమ్కు మంత్రి అభినందనలు

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన ఇండియా అమ్మాయిల టీమ్కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో (3 వికెట్లు, 44 పరుగులు) జట్టు గెలుపుతో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీలో త్రిష అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని అన్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మంత్రి కోరారు.
Similar News
News November 4, 2025
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 519 పాయింట్ల నష్టంతో 83459 వద్ద ముగియగా, నిఫ్టీ 165 పాయింట్లు కోల్పోయి 25597 వద్ద సెటిలైంది. పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, టాటా మోటార్స్, బజాజ్ ఆటో టాప్ లూజర్స్. టైటాన్, భారతీ ఎయిర్ టెల్, బజాజ్ ఫైనాన్స్, ఎం&ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్ లాభపడ్డాయి. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెలికాం మినహా తక్కిన సెక్టార్ల స్టాక్స్ అన్నీ ఎరుపెక్కాయి.
News November 4, 2025
హిందూజా గ్రూప్ ఛైర్మన్ మృతి

హిందూజా గ్రూప్ ఛైర్మన్, ఇండియన్-బ్రిటిష్ బిలియనీర్ గోపీచంద్ హిందూజా (85) కన్నుమూశారు. ఈ విషయాన్ని బ్రిటిష్ హౌస్ ఆఫ్ లార్డ్స్ మెంబర్ రామీ రేంజర్ వెల్లడించారు. గోపీచంద్ మరణంతో ఒక శకం ముగిసిందని, ఆయన సమాజ శ్రేయోభిలాషి, మార్గదర్శక శక్తి అని పేర్కొన్నారు. కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న ఆయన లండన్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
News November 4, 2025
చిన్నశంకరంపేట: ‘బాల్య వివాహాలు చట్ట విరుద్ధం’

చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో విలేజ్ లెవల్ ఛైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి పద్మ, విజన్ ఎన్జీఓ ఆర్గనైజర్ యాదగిరి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. 18 ఏళ్లలోపు బాలిక, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చట్ట విరుద్దమన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులంతా కలిసి బాల్య వివాహాలు చేయమని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.


