News March 21, 2025

సంగారెడ్డి: అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష

image

అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష పడిన ఘటన మునిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పుల్కల్ SI క్రాంతి తెలిపిన వివరాలు.. పుల్కల్‌కు చెందిన పూజితకు మునిపల్లి మండలం తక్కడపల్లికి చెందిన గొల్ల కృష్ణకు 2019 పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. తాగుడికి బానిసైన కృష్ణ 2023లో అత్త, భార్యపై దాడి చేశాడు. అత్త చంద్రకళకు తీవ్ర గాయాలై కొన్ని నెలలు కోమాలో ఉంది. పరారీలో ఉన్న కృష్ణను గురువారం రిమాండ్‌కు తరలించారు.

Similar News

News November 15, 2025

IPL: మ్యాక్సీని వదిలేసిన పంజాబ్!

image

ఆస్ట్రేలియా స్టార్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను రిటైన్ చేసుకోకుండా పంజాబ్ కింగ్స్ విడిచిపెట్టింది. ఆయనతో పాటు ఆరోన్ హార్డీ, కుల్‌దీప్ సేన్, విష్ణు వినోద్‌ను కూడా విడుదల చేసింది. IPLలో విధ్వంసకర బ్యాటర్‌గా పేరొందిన మ్యాక్సీ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నారు. ఈ ఏడాది టోర్నీలో 7 మ్యాచులాడి కేవలం 47 పరుగులే చేశారు. దీంతో మ్యాక్సీని భారంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 15, 2025

పాకాల: ధాన్యం కొనుగోళ్లలో కఠిన నిబంధనలు..!

image

వరంగల్ జిల్లా పాకాల ఆయకట్టు పరిధిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాకుండానే రైతులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి. జల్లెడ వేసిన ధాన్యానికే టోకెన్లు ఇవ్వాలని ఉన్నతాధికారుల ఆదేశాలు రావడంతో రైతులు తీవ్ర అసౌకర్యం ఎదుర్కొంటున్నారు. తాలు, మట్టి, పాడైన ధాన్యం 5% లోపే ఉండాలన్న నిబంధనలు, మిల్లర్ల కేటాయింపు ఆలస్యం రైతులకు తలనొప్పిగా మారాయి. నిబంధనలు పాటించకపోతే కొనుగోలు చేయబోమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

News November 15, 2025

ఉత్తమ్ ప్రచారం.. భారీ మెజార్టీ

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంత్రి ఉత్తమ్ ఎన్నికల సమన్వయకర్తగా వ్యవహరించిన యూసఫ్‌గూడ డివిజన్‌లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. ఈ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీకి 13,829 ఓట్లు లభించగా, బీఆర్ఎస్ పార్టీకి 8,537 ఓట్లు వచ్చాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ 5,292 ఓట్ల (దాదాపు 21%) భారీ మెజారిటీని నమోదు చేసింది. దీంతో, మంత్రి ఉత్తమ్ వ్యూహరచన సత్ఫలితాన్ని ఇచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.