News March 21, 2025
సంగారెడ్డి: అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష

అత్తను కొట్టిన అల్లుడికి జైలు శిక్ష పడిన ఘటన మునిపల్లి మండలంలో చోటుచేసుకుంది. పుల్కల్ SI క్రాంతి తెలిపిన వివరాలు.. పుల్కల్‌కు చెందిన పూజితకు మునిపల్లి మండలం తక్కడపల్లికి చెందిన గొల్ల కృష్ణకు 2019 పెళ్లి చేసి ఇల్లరికం తెచ్చుకున్నారు. తాగుడికి బానిసైన కృష్ణ 2023లో అత్త, భార్యపై దాడి చేశాడు. అత్త చంద్రకళకు తీవ్ర గాయాలై కొన్ని నెలలు కోమాలో ఉంది. పరారీలో ఉన్న కృష్ణను గురువారం రిమాండ్‌కు తరలించారు.
Similar News
News April 24, 2025
ఒంగోలు: రేషన్ మాఫియా డాన్ పనేనా..?

ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ఓ రేషన్ మాఫియా డాన్ పేరు బలంగా వినిపిస్తోంది. ఒంగోలులో హత్య తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. వాహనాలు మారుస్తూ గుంటూరు(D) వెదుళ్లపల్లికి వెళ్లి అక్కడ ఓ రైస్ మిల్లర్ నుంచి డబ్బులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఆ మిల్లర్ సమాచారంతో డాన్‌కు సహకరించారన్న అనుమానంతో నిన్న సాయంత్రం ఐదుగురిని పొన్నూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
News April 24, 2025
9 ఏళ్ల తర్వాత వరుస హాఫ్ సెంచరీలు

ఈ ఐపీఎల్ తొలి నాలుగైదు మ్యాచ్‌లలో విఫలమైన రోహిత్ శర్మ ట్రాక్‌లోకి వచ్చారు. ఈ నెల 20న CSKపై 76*, నిన్న SRHపై 70 రన్స్ చేశారు. ఇలా వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేయడం 9 ఏళ్లలో తొలిసారి. చివరిసారిగా 2016లో 62, 65, 68*, 85* రన్స్ చేశారు. అంతకుముందు 2008లో 76*, 57, 2010లో 51, 68*, 2011లో 87, 56*, 2013లో 74*, 62* బ్యాక్ టు బ్యాక్ అర్ధ శతకాలు బాదారు.
News April 24, 2025
గాలివీడు: ఒకేసారి తండ్రి, కూతురు పాస్

రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన 2025 పది పరీక్షా ఫలితాల్లో తండ్రి, కూతురు ఒకేసారి ఉత్తీర్ణత సాధించారు. గాలివీడు మండలం ఆవుల శెట్టివారిపల్లెకు చెందిన మోడెం వెంకటేశ్ 268 మార్కులు తెచ్చుకున్నారు. ఈయన 9వ తరగతి వరకు చదివి డ్రాప్ అయ్యారు. ఈ ఏడాది ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి పాస్ అయ్యారు. ఆయన కుమార్తె మోడెం పూజిత ఓ ప్రైవేట్ పాఠశాలలో చదివి 585 మార్కులు సాధించింది.