News March 18, 2025

సంగారెడ్డి: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి

image

నారాయణఖేడ్ నియోజకవర్గ భీమ్రాలో అదనపు కట్నం వేధింపులకు వివాహిత మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నాగన్ పల్లికి చెందిన 22 ఏళ్ల పోగుల మహేశ్వరికి రెండేళ్ల క్రితం భీమ్రాకి చెందిన బొండ్ల పండరిరెడ్డితో వివాహం జరిగింది. కొంతకాలంగా ఇరువురి మధ్య అదనపు కట్నం కోసం గొడవలు జరుగుతున్నాయి. భర్త పండరి రెడ్డితో పాటు బంధువులు వేధించారు. సోమవారం ఉదయం మహేశ్వరి ఉరి వేసుకుని మరణించింది.

Similar News

News December 16, 2025

గద్వాల జిల్లాకు ‘రెండు కళ్లు’ వారే..!

image

అలంపూర్‌లోని జోగుళాంబ ఆలయం, జమ్మిచేడు దేవస్థానంలోని జమ్ములమ్మ దేవతలు గద్వాల జిల్లాకు రెండు కళ్లుగా భావిస్తారు. ఈ ప్రాంత ప్రజలు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ ఇద్దరు దేవతలకు విశేష పూజలు నిర్వహిస్తారు. సర్వమంగళాలు కలగాలని, శుభాలు చేకూరాలని కోరుతూ భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవార్లను దర్శించుకుని, మొక్కులు తీర్చుకుంటారు.

News December 16, 2025

ఘోర ప్రమాదం.. మంటల్లో కాలిపోయిన బస్సులు

image

యూపీ మథురలో ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కారణంగా వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నాలుగు బస్సులు మంటల్లో కాలిపోగా.. ఏడుగురు సజీవ దహనమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.

News December 16, 2025

‘యూరియా యాప్‌’.. ఎలా పని చేస్తుందంటే?

image

TG: <<18574856>>యూరియా బుకింగ్ యాప్‌ను<<>> ప్రభుత్వం ఈ నెల 20 నుంచి ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తేనుంది. ఫోన్ నంబర్, OTPతో లాగిన్ అయి ఎన్ని బస్తాల యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చు. యూరియా బుక్ చేయగానే ఓ ఐడీ వస్తుంది. ఏ డీలర్ నుంచైనా బుక్ చేసుకోవచ్చు. బుకింగ్ సమయంలో సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలు ఇవ్వాలి. వాటి ఆధారంగా అవసరమైన యూరియాను 15 రోజుల వ్యవధితో 1-4 దశల్లో అందజేసేలా ఏర్పాటు చేశారు.