News February 13, 2025

సంగారెడ్డి: అనారోగ్యంతో మహిళా కానిస్టేబుల్ మృతి

image

చేర్యాల పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న పైసా స్వప్న కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. దీంతో స్వప్న స్వగ్రామమైన వీరన్నపేటలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఆమె మృతి పట్ల సీఐ ఎల్ శ్రీను, ఎస్ఐ నీరేష్, పోలీస్ సిబ్బంది, పలువురు నాయకులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతురాలికి ఓ కుమారుడు ఉన్నాడు.

Similar News

News December 1, 2025

ఎన్నికల శిక్షణకు గైర్హాజరు.. అధికారులకు షోకాజ్ నోటీసులు

image

పంచాయతీ ఎన్నికల శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా హాజరుకాని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల విధులు చాలా కీలకమని, సిబ్బందిని సన్నద్ధం చేసేందుకే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వీరిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.

News December 1, 2025

చిన్నబజార్ PSను తనిఖీ చేసిన గుంటూరు IG

image

నెల్లూరులోని చిన్నబజార్ PSను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలోని పరిస్థితులు, స్థితిగతులు, నేర ప్రాంతాలపై సిబ్బందిని అడిగి పలు విషయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదుదారులపట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. వీరి వెంట ఎస్పీ అజిత వేజెండ్ల ఉన్నారు.

News December 1, 2025

నందికొట్కూరు ఎమ్మెల్యేను కలిసిన డిప్యూటీ ఎంపీడీవోలు

image

నందికొట్కూరు నియోజకవర్గంలో కొత్తగా నియమితులైన డిప్యూటీ ఎంపీడీవోలు నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్యను సోమవారం కలిశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో నందికొట్కూరు డిప్యూటీ ఎంపీడీవో పాండురంగారెడ్డి, మిడుతూరు ఎంపీడీవో సురేశ్ కుమార్, పగిడ్యాల ఎంపీడీవో మన్సూర్ బాషా, జూపాడుబంగ్లా ఎంపీడీవో మోహన్ నాయక్, పాములపాడు ఎంపీడీవో తిరుపాలయ్య, కొత్తపల్లి ఎంపీడీవో పీఎస్ఆర్ శర్మ ఉన్నారు.