News February 1, 2025

సంగారెడ్డి: అయ్యో పాపం.. కాలు తీసేశారు..!

image

సిద్దిపేట జిల్లా గోవర్ధనగిరిలో రెండురోజుల క్రితం <<15308889>>ఉపాధి హామీ<<>> కూలీలపై మట్టి పెళ్లలు పడిన ఘటనలో తీవ్ర గాయాల పాలయిన ఇంద్రాల స్వరూప కాలు నుజ్జు నుజ్జు కావడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి డాక్టర్లు ఆమె కాలును తొలగించారు. ఈ సంఘటనలో తల్లి కూతుర్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. చికిత్స తీసుకొని ఇంటికి వస్తుందని అనుకున్న స్వరూప కాలు తీసేయడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Similar News

News November 27, 2025

వనపర్తి జిల్లాలో మొదటి రోజు 75 నామినేషన్లు దాఖలు..!

image

వనపర్తి జిల్లాలో మొదటి విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు నేడు మొత్తం 75 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఘణపురం మండలంలో 28 నామినేషన్లు.
✓ గోపాల్ పేట మండలంలో 13 నామినేషన్లు.
✓ పెద్దమందడి మండలంలో 16 నామినేషన్లు.
✓ రేవల్లి మండలంలో 12 నామినేషన్లు.
✓ ఏదుల మండలంలో 6 నామినేషన్లు దాఖలయ్యాయి.

News November 27, 2025

SRCL: ‘అధికారులు విధులు నిజాయితీగా వ్యవహరించాలి’

image

గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఇంచార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో FST, SST, జోనల్ అధికారులకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో జిల్లా సాధారణ, వ్యయ పరిశీలకులు పీ.రవి కుమార్, కే.రాజ్ కుమార్ తో కలిసి ఇంచార్జి కలెక్టర్ గురువారం పాల్గొన్నారు

News November 27, 2025

MHBD జిల్లాలో సర్పంచ్, వార్డులకు నామినేషన్ల వివరాలు ఇలా..!

image

MHBD జిల్లాలో తొలి రోజు గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచి స్థానాలకు 105, వార్డుల మెంబర్ స్థానాలకు 41 నామినేషన్లు వచ్చాయని ఎన్నికల అధికారులు తెలిపారు. సర్పంచ్ స్థానాలు గూడూరు-28, ఇనుగుర్తి-14 కేసముద్రం-21, MHBD-20, నెల్లికుదురు-22 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు మెంబర్ల స్థానాలకు గూడూరు-18, ఇనుగుర్తి-5, కేసముద్రం-4, MHBD-12, నెల్లికుదురు-2 వార్డుల్లో నామినేషన్లు దాఖలు అయ్యాయి.