News February 5, 2025

సంగారెడ్డి: అర్ధరాత్రి అరెస్టుల దుమారం

image

సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలంలో అర్ధరాత్రి అరెస్టుల దుమారం నెలకొంది. స్థానిక నల్లవల్లి అటవీ ఫారెస్టులో నూతనంగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలోని మండల పరిధిలోని ఆయా గ్రామాల నాయకులు బీఆర్ఎస్ నాయకులు, గోవర్దన్ రెడ్డి, కుమార్ గౌడ్ మంగళవారం రాత్రి ముందస్తు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులతో ఉలిక్కిపడిన ప్యారా నగర్, నల్లవల్లి గ్రామస్థులు డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Similar News

News October 26, 2025

తీర ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలు: DMHO

image

తుపాను నేపథ్యంలో బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతాల మండలాలలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసినట్లు DMHO విజయమ్మ చెప్పారు. ఆదివారం బాపట్ల జిల్లా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీ సెంటర్లో అవసరమైన మందులు అందుబాటులో ఉంచామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు మొబైల్ మెడికల్ టీంలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఆస్పత్రులు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు.

News October 26, 2025

ఇతిహాసాలు క్విజ్ – 47 సమాధానాలు

image

1. దశరథ మహారాజు కుల గురువు ‘వశిష్ఠుడు’.
2. ఉలూచి, అర్జునుల కుమారుడు ‘ఇరావంతుడు’.
3. దేవతల తల్లి ‘అధితి’.
4. శివుడు నర్తించే రూపం పేరు ‘నటరాజ’.
5. సత్య హరిశ్చంద్రుడి భార్య పేరు ‘చంద్రమతి’.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 26, 2025

మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం: మహేశ్ గౌడ్

image

TG: DCCల నియామకంపై తమ అభిప్రాయాలు తీసుకున్నట్లు PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చిట్‌చాట్‌లో తెలిపారు. ‘మంత్రుల వివాదం ముగిసిన అధ్యాయం. కొండా సురేఖ విషయంలో CM రేవంత్ సమస్యను సానుకూలంగా పరిష్కరించారు. మేం ఎప్పుడూ హైకమాండ్ రాడార్లోనే ఉంటాం. మంత్రుల వివాదంపై అధిష్ఠానానికి నివేదిక ఇచ్చాం. ఎంత పెద్దవాళ్లు అయినా పార్టీకి లోబడే పనిచేయాలి. జూబ్లీహిల్స్‌లో భారీ మెజారిటీతో గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.