News April 16, 2025
సంగారెడ్డి: అర్హులందరకీ ఇందిరమ్మ ఇల్లు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని కలెక్టర్ వల్లూరు క్రాంతి చెప్పారు. కలెక్టరేట్లో మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 17 నుంచి లబ్ధిదారుల జాబితాను అందిస్తామని చెప్పారు. అర్హుల జాబితాలు మే 2వ తేదీలోగా డిస్ ప్లే చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో అదరపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈవో జానకి రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News October 31, 2025
రేపు పిడుగులతో కూడిన వర్షాలు

ఏపీలోని పలు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిసేటప్పుడు చెట్ల కింద ఉండరాదని సూచించింది. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని IMD తెలిపింది. కాగా ఇవాళ దాదాపు అన్ని జిల్లాల్లో పొడివాతావరణం కనిపించింది. అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిశాయి.
News October 31, 2025
మందలిస్తారని.. పాఠశాల నుంచి పారిపోయిన విద్యార్థి

టీచర్లు మందలిస్తారని భయపడి పాఠశాల నుంచి విద్యార్థి పారిపోయిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె SI ఉమా మహేశ్వర రెడ్డి వివరాల మేరకు.. మదనపల్లె చీకులబైలుకు చెందిన శివ కుమారుడు చరణ్ తంబళ్లపల్లె ST గురుకులంలో 9వ తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి స్నేహితుడితో గొడవపడ్డాడు. టీచర్లు మందలిస్తారని బయపడి శుక్రవారం ఉదయం పాఠశాల నుంచి పారిపోయాడు. తండ్రి పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 31, 2025
కొట్టుకుపోయిన డీసీఎం లభ్యం.. డ్రైవర్ కోసం గాలింపు

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామం సమీపంలోని నిమ్మ వాగు వరద నీటిలో కొట్టుకుపోయిన డీసీఎం వ్యాన్ ఆచూకీ లభించింది. వరద నీరు తగ్గిపోవడంతో వాగులో డీసీఎం వ్యాన్ బయటపడింది. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో క్రేన్ల ద్వారా ఆ వ్యాన్ను బయటకు తీశారు. అయితే, డ్రైవర్ ఆచూకీ లభ్యం కాకపోవడంతో అతని కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు.


