News February 14, 2025
సంగారెడ్డి: ఆన్‌లైన్‌లో పదో తరగతి విద్యార్థుల FA మార్కులు

సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ఎఫ్ఏ మార్కుల రికార్డులను పర్యవేక్షణ బృందం గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా పర్యవేక్షణ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఈ మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Similar News
News February 21, 2025
కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

తెలంగాణలో డీజీగా ఉన్న అంజనీకుమార్‌ను వెంటనే రిలీవ్ చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలిచ్చింది. అంజనీ కుమార్ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయనతో పాటు TG పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్, కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. ఏపీ క్యాడర్‌లో రిపోర్టు చేయాలని ఈ ముగ్గురికి ఆదేశాలు జారీ చేసింది.
News February 21, 2025
కుంభాభిషేక కార్యక్రమానికి కేసీఆర్‌కు ఆహ్వానం

యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేక కార్యక్రమానికి రావాల్సిందిగా ఆలయ పూజారులు శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 23న మహా కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.
News February 21, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: అడిషనల్ కలెక్టర్
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
> ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసిన రవాణా అధికారులు
> ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలపై జిల్లా కలెక్టరేట్లో సమావేశం
> తేనెటీగల దాడిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
> పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయ ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్