News February 27, 2025
సంగారెడ్డి: ఆలయం సమీపంలో మహిళ మృతదేహం

మహాశివరాత్రి వేళ సంగారెడ్డి జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. సదాశివపేటలోని శంభు లింగేశ్వర ఆలయం వెనుక మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో పరిశీలిస్తున్నారు. మృతురాలు మండలంలోని నందికంది గ్రామానికి చెందిన సారలక్ష్మిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 28, 2025
సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్‌గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.
News November 28, 2025
NTR: ఆ MLA తీరు అంతేనా.? షాక్‌కి గురైన నేతలు, అధికారులు.!

మంత్రి సత్యకుమార్ ఆధ్వర్యంలో విజయవాడలో నిన్న జరిగిన వైద్య సేవల సమీక్షలో MLA తీరు చర్చనీయాంశమైంది. పాత ప్రభుత్వాసుపత్రిలో చివరి దశకు చేరుకున్న క్రిటికల్ కేర్ యూనిట్ నిర్మాణంలో రూ.3కోట్ల అవినీతి జరిగిందంటూ విజయవాడకు చెందిన ఓ MLA ఆరోపించారు. నిర్మాణం నిలిపివేసి విచారణ జరపాలని పట్టుబట్టడంతో, తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రోగుల పరిస్థితిని పట్టించుకోకుండా MLA మాట్లాడటంపై సమావేశంలో అసహనం వ్యక్తమైంది.
News November 28, 2025
కేజీహెచ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రారంభం

కేజీహెచ్‌లోని గైనిక్ వార్డులో బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పిల్లల తల్లులకు అన్ని రకాల ఉపయోగాలు చేకూరుతాయని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యులు, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.


