News February 10, 2025
సంగారెడ్డి: ఇంజినీరింగ్ విద్యార్థి మిస్సింగ్

ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థి అదృష్టమైన ఘటన సంగారెడ్డిలోని బ్రాహ్మణవాడలో ఆదివారం చోటుచేసుకుంది. పట్టణ ఎస్సై రమేష్ కథనం ప్రకారం.. బ్రాహ్మణ వరకు చెందిన వాణిశ్రీ కుమారుడు రిషిక్ రెడ్డి(22) నర్సాపూర్ శివారులోని BVRITలో చదువుతున్నాడు. కళాశాలలో ప్రాజెక్టు వరకు సబ్మిట్ చేయాలని చెప్పి ఈనెల 8 ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
Similar News
News February 22, 2026
పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక

తమ వివాహాన్ని విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు ప్రకటించారు. ఈ మేరకు ఇరువురూ ఒకే తరహా పోస్టును ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘మేం ఏదైనా ప్లాన్ చేయడానికి ముందే మీరు చాలా ప్రేమతో మాకు ఓ పేరు పెట్టారు. మమ్నల్ని VIROSH అని పిలిచారు. మీ ఇష్ట ప్రకారమే మా వేడుకకు The Wedding of VIROSH అని పేరు పెట్టాలనుకుంటున్నాం. మీ ప్రేమకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఈనెల 26న ఉదయ్‌పూర్‌లో పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
News February 22, 2026
ట్రంప్ రిసార్ట్‌లోకి అగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ

US అధ్యక్షుడు ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్‌లోకి ఓ వ్యక్తి ప్రవేశించేందుకు యత్నించడం కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది అతడిని కాల్చి చంపారు. లొంగిపోవాలని సూచించగా అతను గన్ పైకెత్తడంతో కాల్పులు జరిపి అంతమొందించారు. ఘటన జరిగినప్పుడు ట్రంప్ వాషింగ్టన్‌లో ఉన్నారు. సముద్రతీరంలో నిర్మించిన ఈ రిసార్టును ట్రంప్ 1985లో కొనుగోలు చేశారు. దీన్ని వింటర్ వైట్‌హౌస్ అని పిలుస్తారు.
News February 22, 2026
అనూరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేశ్

తూ.గో. జిల్లాలో అనూరియా(మూత్రపిండాల వ్యాధి) కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆదివారం సూచించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేశ్ అధికారులు, వైద్య వర్గాలతో కలిసి తాజా పరిస్థితులను ఆదివారం ఫోన్ ద్వారా సమీక్షించినట్లు ఆయన తెలిపారు. అనూరియా వ్యాప్తి నివారణ కోసం అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలన్నారు.


