News February 28, 2025
సంగారెడ్డి: ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

సంగారెడ్డి జిల్లాలో మార్చి 3 నుంచి జరుగనున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవింద్ రామ్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగిన సౌకర్యాలు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.
Similar News
News March 23, 2025
కోర్ట్.. 9 రోజుల్లో రూ.46.80 కోట్లు

రామ్ జగదీశ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘కోర్ట్: స్టేట్ వర్సెస్ నోబడీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. 9 రోజుల్లోనే రూ.46.80 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇవాళ్టితో రూ.50 కోట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. హీరో నాని నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ కీలక పాత్రలు పోషించారు.
News March 23, 2025
ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు

ఎయిర్ టాక్సీలకు కేంద్రంగా గుంటూరు మారుతోంది. ఈ గాల్లో ఎగిరే టాక్సీలను తయారు చేస్తున్న సంస్థ పేరు మ్యాగ్నమ్ వింగ్స్. గుంటూరు నల్ల చెరువులో చావా అభిరాం అనే వ్యక్తి ఈ ఎయిర్ ట్యాక్సీలను తయారు చేస్తున్నాడు. ట్రాఫిక్‌తో సతమతమవుతున్న నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ పనికి పూనుకున్నారు. తక్కువ ఖర్చుతో ఈ ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణం చేసేలా రూపొందిస్తున్నారు.
News March 23, 2025
విజయనగరం పోలీసుల సేవలకు గుర్తింపు

రాష్ట్ర ప్రభుత్వం అందజేయనున్న ఉగాది పురస్కారాలకు విజయనగరం పోలీస్ శాఖలో పనిచేస్తున్న పలువురు సిబ్బంది ఎంపికయ్యారు. స్థానిక ఎస్బి ఎస్ఐ వై.సత్యనారాయణ, ఎస్సీ, ఎస్టీ సెల్ ASI ప్రసాదరావు, ఆర్మడ్ రిజర్వ్ ఏఆర్ SI అప్పలరాజు, AR హెడ్ కానిస్టేబుల్ గోవిందం, AR కానిస్టేబుల్ శ్రీనివాసరావు ఉగాది పురస్కారాలకు ఎంపికైనట్లు ఎస్పీ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు.