News March 6, 2025
సంగారెడ్డి: ‘ఇంటర్ పరీక్షలకు 97.5% హాజరు’

జిల్లాలో 54 పరీక్ష కేంద్రాలలో నేడు జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల్లో 18,852 మంది విద్యార్థులకు గాను 18,296 మంది విద్యార్థులు హాజరయ్యారని (97.5% )ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు. 556 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News March 22, 2025
రాష్ట్రంలో 10,954 ఉద్యోగాలు

TG: రాష్ట్ర రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనా అధికారుల పోస్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్వోలు, మాజీ VRAల నుంచి ఆప్షన్లు తీసుకుని ఈ నియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో ఈ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
News March 22, 2025
MBNR: ఎండ తీవ్రత.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

✓ దాహం వేయకపోయినా వీలైనప్పుడల్లా తగినంత నీరు తాగాలి. ✓ ప్రయాణాల్లో తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. ✓ నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తినాలి.✓సన్నటి, వదులుగా ఉండే లేత రంగు కాటన్ దుస్తులు ధరించాలి. ✓ ఎండలో బయటకు వెళ్తే గొడుగు, టోపి వంటివి ఉపయోగించాలి.✓ పగటి వేళలో కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లోనే బయటకు వెళ్లాలి.✓ ఆల్కహాల్, టీ, కాఫీ తాగకపోవడం మంచిదని వనపర్తిలోని డాక్టర్లు సూచిస్తున్నారు.
News March 22, 2025
వనపర్తి: ‘తిరుమలయ్య గుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దాలి’

వనపర్తి జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న తిరుమలయ్య గుట్టపై చిట్టడవిలో సంస్థానాధీశుల కాలంలో ప్రతిష్ఠించిన తిరుమలనాథస్వామి ఆలయం సుమారు 600 అడుగుల ఎత్తైన కొండపై ఉంది. ఔషధ గుణాలున్న ఎన్నో చెట్లు ఈ గుట్టపై ఉన్నాయి. ఏటా శ్రావణమాసంలో ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, AP రాష్ట్రాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.